రాజమౌళి-మహేష్ కాంబోలో మూవీ..రిలీజ్ డేట్, హీరోయిన్ ఖరారు?

0
119

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు సూపర్ స్టార్. ఇక తాజాగా ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఓ వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ మరో బిగ్ మూవీకి ఒకే చెప్పాడు.

టాలీవుడ్ జక్కన్న, సంచలన దర్శకుడు రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించి  SSMB#29 సినిమాగా తెరకెక్కుతున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ గ్లోబెట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లోను ఏకకాలంలో తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తుంది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.