T20 World cup: పంతా? కార్తీకా? టీమిండియాలో చోటు దక్కేదెవరికి?

0
107

వచ్చే అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఇక అంతకు ముందే ఇండియా ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఆయా జట్లు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంది. ఇందులో రాణించిన వాళ్లే ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తాజాగా టీమిండియాలోని ఈ ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రధానంగా ఇందులో రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. అసలు సమస్య మిడిలార్డర్ తోనే. ముఖ్యంగా పంతా? కార్తికా? ఎంపికపై జట్టు మల్లగుల్లాలు పడుతుంది. ప్రస్తుతం దినేష్ కార్తీక్ ఫామ్ లో ఉండగా పంత్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.

అయితే అలా అని పంత్ ను తక్కువ చేయలేము. తనదైన రోజు ఆట స్వరూపమే మార్చగలడం అతని నైజం. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ఎడమచేతివాటం ఆటగాళ్లు లేకపోవడం పంత్ కు కలిసి రానుంది. ఇదే జరిగితే సెలెక్టర్లు పంత్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.