యూపీలోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 21లో డ్రైనేజి మరమత్తులు చేస్తుండగా..గోడ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. కాగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.