వంకాయ నచ్చిందని అతిగా తింటున్నారా? అయితే ఒకసారి ఇది చూసేయండి..

0
102

మనలో చాలామంది వంకాయలను ఇష్టంగా తింటుంటారు. కానీ ఇష్టం కథ అని అతిగా తింటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. వంకాయ అతిగా తినడం వల్ల కలిగే అనర్దాలు, ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎనీమియా సమస్యతో బాధపడేవాళ్ళు వంకాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా వంకాయ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు వేధించే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండే వాళ్ళు వంకాయలకు వీలయినంత దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వంకాయలను తినకూడదు. శరీరంలో ఐరన్ అధికంగా ఉన్నవారు కూడా తీసుకోకూడదు.