BIG BREAKING: జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాట..మహిళ మృతి

0
71

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. దీనితో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. ఈ క్రమంలో టికెట్ల కోసం అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీనితో జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో 20 మంది అభిమానులు స్పృహ తప్పినట్లు తెలుస్తుంది. అలాగే ఓ మహిళ కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.