CUET PG ఫలితాలపై లేని స్పష్టత..ఆందోళనలో విద్యార్థులు

0
109

CUET PG కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫలితాలతో పాటే ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. ఒకేసారి ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు cuet.nta.nic.in మరియు nta.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఈ CUET PG పరీక్ష అనేది ముల్టీపుల్ ఛాయిస్ క్వచ్చన్స్ గా నిర్వహిస్తారు. ఫైనల్ కీ ఆధారంగా అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే వివిధ షిఫ్ట్ లలో పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలను NTA స్కోర్ గా మార్చబడతాయి.

CUET PG అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు ఇవే..

1.CUET PG 2022 స్కోర్ యొక్క చెల్లుబాటు ఎంత?
CUET PG 2022 యొక్క NTA స్కోర్ 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

2. PG ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి తుది మెరిట్ జాబితాను ఎవరు నిర్ణయిస్తారు?
NTA CUET PG 2022 స్కోర్‌కార్డ్‌ మాత్రమే. CUET PG ఫలితాల ప్రకటన తర్వాత, కౌన్సెలింగ్‌తో సహా అడ్మిషన్ కు సంబంధించినవి విశ్వవిద్యాలయాలు మాత్రమే నిర్వహిస్తాయి.

3. ఏ కళాశాలలు CUET కిందికి వస్తాయి?
40కి పైగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాలు CUET PG 2022లో పాల్గొంటున్నాయి.

4. అభ్యర్థులు CUET PG ఫలితాలను తిరిగి తనిఖీ చేసుకోవచ్చా?
ఈ ఫలితాలు కీని ఆధారంగా చేసుకొని నిర్ధారించబడ్డాయి. కాబట్టి ఫలితాల విడుదల తర్వాత ఆన్సర్ కీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వుండవు.

5. CUET PG ఫలితాలు ఎప్పుడు ప్రకటించబడతాయి?
CUET PG ఫలితాల తేదిని NTA ఇంకా ప్రకటించలేదు.

6.CUET లో PG కోర్సులు ఉన్నాయా?
అవును. CUET PG అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసమే నిర్వహించబడుతుంది.

7. CUET PG స్కోర్‌కార్డ్ ఏమి కలిగి ఉంటుంది?
CUET PG స్కోర్ కార్డ్‌లో..
సెక్షన్ 1 జనరల్ పేపర్‌లు (25 ప్రశ్నలు), సెక్షన్ 2 డొమైన్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు), ప్రతి కోర్సుకు వర్తించే చోట ప్రత్యేక స్కోర్‌లు కూడా ఉంటాయి.