సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు సూపర్ స్టార్. ఇక తాజాగా ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఓ వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ మరో బిగ్ మూవీకి ఒకే చెప్పాడు.
టాలీవుడ్ జక్కన్న, సంచలన దర్శకుడు రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు కొంతమేరకు ఊరట కలిగించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్ ను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మరెవరో కాదు..శామ్యూల్ ఎల్ జాక్స్. కానీ ఈ వార్తలో ఎంతవరకు వాస్తవముందో తెలియాల్సి ఉంది.