అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై

0
101

టీమిండియా స్టార్ మహిళా ప్లేయర్ ఝులన్ గోస్వామి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే తనకు చివరి మ్యాచ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం అంతా బావోద్వేగమే. వీడ్కోలు మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ఆమెను ఎత్తుకొని స్టేడియం చుట్టూ తిప్పారు. కాగా ఇండియా జట్టులో గోస్వామి ప్రధాన పేసర్ గా ఉంది. 4 ఏళ్ల క్రితం టీ20లకు గుడ్ బై చెప్పిన ఝులన్ తాజాగా చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కూడా ఆడింది. చివరగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో గోస్వామి 2 వికెట్లు పడగొట్టింది.