రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం..76 మంది ఎమ్మెల్యేల రాజీనామా

0
89
Telangana Congress Party

రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న అశోక్ గహ్లోత్ ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కించుకుంటే మరి రాజస్థాన్ సీఎం పీఠం ఎవరికీ దక్కుతుంది అనేది ప్రశ్న. మరి ఆయనే రెండు పదవుల్లో ఉంటారా లేక సచిన్ పైలట్ ను సీఎంగా నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అశోక్ గహ్లోత్ కు మద్దతుగా 76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్ ను సీఎంగా ఎంపిక చేయొద్దని, 2020లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినా వ్యక్తికి సీఎం పదవి ఇస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.