అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి తానా బోర్డు సభ్యుడు కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు.