ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే డబ్బులను ఇన్వెస్ట్ చేయడం లాభాల బాట పట్టొచ్చనే ఉద్దేశ్యంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి వారికోసం పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ను ప్రవేశపెడుతున్నారు.
రూ.1000 నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ లో మీకు నచ్చినన్ని పైసలు పెట్టుబడి పెట్టొచ్చు. 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ లో చేరడానికి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.
ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు ఎవరంటే..ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యడానికి 18 ఏళ్లుపైబడి ఉండాలి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రెండున్నరఏళ్లు పైబడిన తర్వాత పెనాల్టీ లేకుండా డబ్బులను తీసుకోవచ్చు. కానీ ఏడాది నుంచి రెండున్నర సంవత్సరాల లోపు డబ్బులు తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది.