ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపూడి దగ్గర సాయి శేషు టవర్స్ పైనుండి దూకి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో వారు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులను కందుల మాధవి, సత్యవతిగా పోలీసులు గుర్తించారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.