Political News: AICC అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే?

0
149
Telangana Congress Party

AICC అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. రేసులో ప్రధాన అభ్యర్థిగా ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లూత్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక పోటీలో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మాత్రమే ఉంటారని అంతా భావించారు. కానీ తాజాగా పోటీలో మల్లికార్జున ఖర్గే చేరారు. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తుంది. అంతేకాదు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ కంటే మల్లికార్జునకే విజయావకాశాలు ఎక్కువున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.