వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న కేతిరెడ్డి, ఓ ఇంటి ముందుకు వచ్చి అక్కడ కట్టిన టీడీపీ జెండాను చూపిస్తూ మనది కాదా అది అని ప్రశ్నించారు. అనంతరం వైసీపీ అమలు చేస్తున్న పథకాలతో కూడిన బుక్లెట్ను ఇవ్వగా, సదరు వ్యక్తి తీసుకోకుండా, కట్టిన టీడీపీ జెండా నాదే, మీరు వద్దు మీ పథకాలు వద్దు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి మొహం మీద తెగేసి చెప్పాడు. అయితే పథకాలు వద్దా అంటూ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ కట్టిన టీడీపీ జెండా నాదే మీరు వద్దు మీ పథకాలు వద్దు అంటూ వైసీపీ ఎమ్మెల్యే మొహం మీద తెగేసి చెప్పిన టీడీపీ కార్యకర్త ? pic.twitter.com/v8GcSkMPgD
— I Love India✌ (@Iloveindia_007) October 1, 2022