సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి మహిళా కానిస్టేబుల్ జారి పడిపోయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం వద్దకు చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నేతలు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ కదులుతుండగా, మహిళా కానిస్టేబుల్ జారి పడిపోయింది. అయినప్పటికీ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో సహా పోలీసులు, గాయపడ్డ మహిళా కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు.