ఆచార్య పరాజయంపై మెుదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆచార్య ఫలితం తనను బాధించలేదు కానీ, మొదటిసారి చరణ్‌తో కలిసి సినిమా చేశాను.. హిట్ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్ రాకపోవచ్చు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య ఫ్లాప్‌పై స్పందించారు. ఆచార్య పరాజయం నన్నస్సలు బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే.. మేము చేశాం అని అన్నారు. కెరీర్ కొత్తలో పరాజయం వస్తే బాధపడేవాడిని, కానీ ఆరోజులు గడిచిపోయాయి. మెుదటి 15 సంవత్సరాల్లోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నటుడిగా పరిణితి చెందిన తరువాత సినిమా పరాజయాలు బాధపెట్టలేదు.. విజయాన్ని తలకెక్కించుకోలేదు అని చిరంజీవి తెలిపారు.