TDP Leader Jawahar Comments On CM Jagan Over liquor Policy: సీఎం జగన్ ప్రజలను మత్తులో పెట్టి పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీ దుకాణాలకన్నా( వైన్) వాకిన్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో మద్యం వ్యాపారం సీఎం జగన్ కనుసన్నలలో జరుగుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ సీఎంకు గుర్తులేదని, మద్యంపై వచ్చే అక్రమ ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం రాష్ట్ర సీఎంకు పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నకిలీ మద్యం వల్ల మహిళల మాంగళ్యాలు రాలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలను మత్తులో పెట్టి పాలన: TDP Leader Jawahar
-