రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు దిగిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో, బాధిత కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది. సమరిన్(14), ఖలేదు(12) రెహాన (10), ఇమ్రాన్ (9)లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దసరా సెలవులు కావటంతో, గొల్లగూడలోని దర్గాలోని ప్రార్థనలు అనంతరం ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. లోతు ఎక్కువుగా ఉండటంతో పిల్లలు నలుగురూ మునిగిపోవటంతో ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు మృతి చెందినట్లు గ్రామస్థులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.