తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కసరత్తు సమావేశం నిర్వహించారు. 2023 మార్చి 29తో ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా గ్రాడ్యుయేట్ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
గ్రాడ్యుయేట్ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి: మంత్రి పెద్దిరెడ్డి
-