దుశ్శాసనుల పార్టీగా టీడీపీ: మంత్రి రోజా

-

టీడీపీపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ దుశ్శాసునుల పార్టీగా మారిందంటూ ధ్వజమెత్తారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి ట్వీట్లు చేసే లోకేష్‌.. టీడీపీ నేత వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థి గురించి ఎందుకు ట్వీట్‌ చేయలేదని నిలదీశారు. టీడీపీని వీడిన దివ్యవాణి చెప్పినట్లే.. ఆడవాళ్లను వేధించిన వాళ్లకే టీడీపీలో పదవులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో రిషితేశ్వరి వంటి అమ్మాయిపై జరిగిన ఘోరం, వనజాక్షి లాంటి అధికారిని ఇసుకలో వేసి మరీ కొట్టడం, వంటివి జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ టీడీపీ అంటే ఇడియట్స్‌ టీడీపీగా మారిందంని రోజా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు సాధికారత తెచ్చిన ప్రభుత్వం అని అన్నారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చారనీ.. దిశా చట్టాన్ని చేశారని, దిశా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో దిశ చట్టం ఇంకా అమలు కాకపోయినా, ఆ స్ఫూర్తితోనే పోలీసులు, సిబ్బంది, అధికారులు పని చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...