కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా తన గన్‌మెన్‌లను మార్చుతున్నారని వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన (Driver Dastagiri) దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏమైనా జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలంటూ కడప ఎస్పీను కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ, గత వారం రోజులుగా తన భద్రత కోసం ఏర్పాటు చేసిన గన్‌మెన్‌లను పదేపదే మారుస్తున్నారని వాపోయారు. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ ఆదేశాల మేరకు కడప ఎస్పీకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇదిలా ఉండగా, దస్తగిరి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. గన్‌మెన్‌లను అనవసరంగా మార్చుతున్నారంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న గన్‌మెన్‌లను తొలగించినట్లు వివరించారు. గన్‌మెన్‌లను మార్చడమనేది పాలనా పరమైన అంశాల్లో అంతర్భాగమని ఎస్పీ పేర్కొన్నారు. కాగా సీఎం జగన్ స్వయాన చిన్నాన్న అయిన వైయస్ వివేకానంద రెడ్డి (Ys Vivekanada Reddy), ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసింది.
Read also: పేరుకే బ్యూటీపార్లర్.. లోపల చేసేవన్నీ గబ్బు పనులే!