Intimacy: భర్తతో శృంగారం బోర్‌ కొడుతుందా?

-

Tips for intimacy to improve your sex life: శృంగారం అనేది దంపతులను అర్థం చేసుకోవటానికి, వారిద్దర మధ్య నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. శృంగారానికి ముందు, తరువాత భార్యభర్తలు వారి మనసుల్లో మాటలను స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి, బిడియం లేకుండా ఆలోచనలను పంచుకోవటానికి సూపర్‌ టైమ్‌. సెక్స్‌(Intimacy) ప్రత్యేకంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా.. వెరైటీ పొజిషన్స్‌లో సెక్స్‌ చేయటానికి ఇష్టపడుతుంటారు.

- Advertisement -

కానీ పురుషుల్లో కొంతమంది ఒకే మూసధోరణిలో, వెళ్లటం, మహిళకు ఇష్టమో లేదో తెలుసుకోకుండానే, తన సుఖాన్ని చూసుకొని వెళ్లిపోవటం వంటివి జరుగుతుంటాయి. దీంతో భర్తతో శృంగారం బోర్‌ కొట్టినట్లు ఫీల్‌ అవుతుంటారు. ఈ విషయాన్ని భర్తకు ఎలా చెప్పాలో చాలా మంది మహిళలకు తెలియదు. సెక్స్‌ బోరింగ్‌గా ఉందని భర్తకు ఎలా చెప్పాలో తెలుసుందాం రండి.

మీరు చెప్పకుండా, మీరు ఏమి కోరుకుంటున్నారో, మీ భాగస్వామికి తెలియదు కాబట్టి, మీ మనసులో ఏముందో కచ్చితంగా చెప్పి తీరాల్సిందే. దీనికోసం సరైన స్థలం కోసం వెయిట్‌ చేయాలి. తొందరపడి విషయం మెుత్తం చెప్పేయకుండా, సరైన సమయంలోనే, భర్తకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి, అంతేగానీ అతడు నొచ్చుకునే విధంగా చెప్పకూడదు. సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నించాలి.

ఒకవేళ మీరు క్లియర్‌గా చెప్పినప్పటికీ, అతడు చేయకపోతే.. లైంగికంగా(Intimacy) ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. భర్తకు కూడా సమయం ఇవ్వాలి. అతనే ఏదొక రోజు స్పెషల్‌గా సెక్స్‌ చేసేందుకు ఆసక్తిని పెంచుకుంటాడు.

సెక్స్‌ అనేది మాట్లాడటానికి ఎంతో సెన్సిటివ్‌ అయిన విషయం. ఎంత పెళ్లి అయినప్పటికీ.. ప్రతి విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడితే, కొందరు భర్తలు ఇష్టపడకపోవచ్చు. లేదా మీరు చెప్పే మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ కోరికలు సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి.

మీ కోరికలతో పాటు, మీ భర్తకు ఇష్టమైన భంగిమల గురించి, వారికి ఏ రకంగా చేస్తే వారు భావప్రాప్తి పొందుతున్నారో.. అడిగి తెలుసుకోండి. దీనిద్వారా ఇష్టఇష్టాలను పంచుకున్నట్లవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ, భాగస్వామితో మాట్లాడి చూడండి.

Read Also: భాగస్వామి ఉన్నా… ఇందుకే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....