Ginna pre release:నేడే జిన్నా జాతర

-

Ginna pre release: మంచు విష్ణు హీరోగా, సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన జిన్నా (Ginna) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ జేఆర్సీ కన్వెనాషన్స్‌లో 5:30 గంటలకు మెుదలుకానుంది. విష్ణు సొంత బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితం కాగా, సూర్య దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ టచ్‌తో కూడిన యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రేక్షకుల ముందుకు సినిమా ఈ నెల 21 న రానుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూర్చారు. కాగా, జిన్నా జాతర పేరిట ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్‌ నటుడు నరేశ్‌, సురేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక విష్ణుకు ఈ సినిమా తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో విష్ణుకు బ్రేక్‌ ఇచ్చే సరైన హిట్‌ లేదనే చెప్పుకోవాలి. ఇటీవల వచ్చిన మోసగాళ్లు అనే సినిమాను భారీ అంచనాల మధ్య విడుదల చేసినా, ఆశించిన స్థాయిలో ఆడలేదనే చెప్పుకోవాలి. ఈ జిన్నా ఎటువంటి ఫలితం అందిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...