Pawan kalyan :115 మందికి పైగా జనసైనికులను అరెస్టు చేశారు.. హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై హైకోర్టుకు వెళ్తాం.. మా పోరాటం పోలీసులపై కాదు.. ప్రభుత్వంపైనే తమ పోరాటమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్నారు. ఎన్నో అనూహ్య పరిణామాల తరువాత విశాఖ నుంచి విజయవాడకు పవన్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసైనకులను అరెస్టు చేసి.. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 115 మందిలో 12 మందిని రిమాండ్‌కు పంపించారనీ.. వీరిలో చాలా మందికి జనసేన లీగల్ టీమ్ కష్టపడి బెయిల్ ఇప్పించిందని వివరించారు. మిగిలిన వారికి కూడా బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తమ పోరాటం పోలీసుల మీద కాదనీ.. ప్రభుత్వంపైనేనని తేల్చి చెప్పారు. తిరుగు పయనంలో కనీసం నా అభిమానులకు ప్రతి అభివాదం చేసే పరిస్థితి లేదంటే.. అది కేవలం వైసీపీ ప్రభుత్వ ఆంక్షల వల్లేనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా ఉండేందుకు పోరాటం చేస్తామని పవన్ అన్నారు. ఈ మేరకు పవన్ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/aoUxwpphO5
— JanaSena Party (@JanaSenaParty) October 17, 2022