BCCI new president: అందరూ అనుకున్నట్లుగానే బీసీసీఐ నూతన ప్రెసిడెంట్‌గా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో సౌరవ్ గంగూలీ ఉండగా, ఆయన పదవీ కాలం ముగియటంతో రోజర్ బిన్నీ పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఎవరూ పోటీ చేయకపోవటంతో, మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సమావేశంలో బిన్నీను కొత్త అధ్యక్షుడిగా(BCCI new president) బీసీసీఐ ప్రకటించింది. జైషానే మరోసారి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ట్రెజరర్‌గా ఆశిష్ షెలార్‌లు బాధ్యతలు స్వీకరించారు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అయిన రోజర్, భారత్ జట్టులో ఆడిన స్టువర్ట్ బిన్నీకు తండ్రి కూడా.