Power cut: మంత్రికి తప్పని కరెంట్‌ కోత కష్టాలు

-

Power cut: ఓ మంత్రి ఓ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. అనంతరం అక్కడ ఉన్న దంత పరీక్షలు చేయించుకోగా రూట్‌కెనాల్‌ చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఎక్కడకో వెళ్లి చికిత్స చేయించుకోవటం ఎందుకు.. మీరే ఆ చికిత్సను ఇక్కడే చేయండి అని మంత్రి చెప్పటంతో, చికిత్స ప్రారంభించారు. కానీ చికిత్స మధ్యలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌ లైట్‌తో చికిత్సను పూర్తిచేసేశారు వైద్యులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. ఔరంగాబాద్‌లోని ఘటి ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు కేబినేట్‌ మంత్రి సందీపన్‌ భుమ్రే వెళ్లారు. అనంతరం అక్కడ దంత పరీక్షలు చేయించుకోగా.. రూట్‌ కెనాల్‌ చికిత్స చేయించుకోవాలని సందీపన్‌కు వైద్యులు సూచించారు. చికిత్సను అక్కడే ప్రారంభించాలని మంత్రి కోరిటంతో, వైద్యులు చికిత్స మెుదలుపెట్టారు. చికిత్స మధ్యలోనే కరెంట్‌ కోతలతో (Power cut) విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్‌ కాంతిలో చికిత్స పూర్తి చేశారు. ఎప్పటి నుంచో ఆసుపత్రికి జనరేటర్‌ కావాలని వైద్యులు చెప్తున్నా.. ఎటువంటి స్పందనా లేదని ఈ సందర్భంగా మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి సందీపన్‌ నిధులు మంజూరు చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయాన కేబినేట్‌ మంత్రి వచ్చినప్పుడే ఇలా జరిగితే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

- Advertisement -

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...