Pregnant: మగవారితో సమానంగా ఆడవారు పని చేయటం నేటి సమాజంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆడవారికి పెళ్లి కావటం, వారు గర్భవుతులైనా.. ఆఫీసులకు వెళ్లటం సహజమే. గర్భవతి (Pregnant)గా మారటం అనేది ప్రతి ఆడవారి జీవితంలో ఓ మధరుమైన అనుభూతి. ఈ సమయంలో మానసికంగా, శారరీకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటువంటి సమయాల్లో కూడా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం అంటున్నారు నిపుణులు.
ఇంట్లో ఉంటే ఎంత పౌష్టికాహరం తీసుకుంటారో, ఆఫీసులో కూడా అదే విధంగా పౌష్టికాహారాన్ని తినాలి. బాక్సుల్లో ఫ్రూట్స్‌ను తీసుకువెళ్లటం, పని మధ్యలో తింటూ ఉంటే, తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఢోకా ఉండదంటున్నారు డాక్టర్లు. భోజనంలో కచ్చితంగా ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు ఉండేటట్లు చూసుకోవాలని సూచిస్తున్నారు. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువుగా తీసుకోవాలనీ.. ఇవి శిశువు పెరుగదలను పెంచుతుందని నిపుణులు వివరించారు. ఆఫీసులో ఉన్నప్పుడు కొలీగ్స్ తీసుకువచ్చే జంక్ ఫుడ్‌ను, బయట దొరికే చిరు తిళ్లును దూరం పెట్టమని హెచ్చరిస్తున్నారు. ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవటం నివారించటం ఉత్తమని అంటున్నారు. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు మజ్జిగ లేదా, తాజా పండ్ల రసం తాగటం వంద రెట్లు మంచిదని సూచిస్తున్నారు.
ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోకుండా, అటు ఇటు నడవాలని వైద్యులు చెప్తున్నారు. ఒకే దగ్గర ఎక్కువ సేపు ఉండటం వలన శిశువుకు రక్తప్రసరణ తగ్గి, శిశువు ఎదుగుదల మందగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువ లేకుండా తీసుకోండి. ఒత్తిడి ప్రభావం శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగ సంబంధింత ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. కాళ్లను చాచటానికి తరుచుగా వాహనాన్ని ఆపి.. రెండు అడుగులు వేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. బరువులు ఎత్తటం వంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. పుట్టబోయే బిడ్డకు, కాబోయే అమ్మ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదని డాక్టర్లు చెప్తున్నారు.