మన జుట్టు సీజన్స్ ని బట్టి రకరకాల సమస్యలకు గురి అవుతుంది. సాధారణంగా చలికాలంలో తలపై చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చల్లటి వాతావరణం వల్ల తలపై చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడంతోపాటు పూర్తిగా నివారించడానికి, కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని సెకన్ల పాటు వేడి చేయాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు తలపై అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో వాష్ చెయ్యాలి. ఇలా ప్రతి వారంలో రెండుసార్లు చేయండి. ఇది చాలా ఈజీగా ఉండడమే కాదు, బాగా పని చేస్తుంది కూడా.