Psycho attack: శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో హల్‌చల్ చేశాడు. టీ తాగుతున్న వృద్ధిడిపై సైకో దాడి చేయటంతో, బాధితుడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పలాస-కాశీబుగ్గ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వృద్ధుడు టీ తాగుతున్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాడో సైకో (Psycho).. అకస్మాత్తుగా వృద్ధుడిపై కర్రతో దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కర్రతో దాడి చేయటంతో వృద్ధుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి, సైకోను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం విద్యుత్ స్తంభానికి కట్టేసి.. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సైకోను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హల్‌చల్ చేసిన సైకో జడ గోవిందరావుగా గుర్తించారు. గాయపడిని వృద్ధుడి ఫిర్యాదు మేరకు సైకోపై కేసు నమోదు చేసినట్లు సీఐ శంకరరావు వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడా.. లేదా.. మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read also: CBN Tweet: అమరావతే గెలుస్తుంది… ఇదే ఫైనల్