Pothina Mahesh :అందులో వైసీపీ నేతలు దిట్ట

-

Pothina Mahesh: రాష్ట్ర పర్జలను రెచ్చగొడ్డి విద్వేషాలను రగల్చటంలో, శాంతిభద్రతలకు భంగం కల్పించటంలో వైసీపీ నేతలు దిట్ట అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ, వైసీపీ నేతలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌ పేరిట.. వైసీపీ సర్కార్‌ మరొక అరాచకం సృష్టించాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. జనసేన పార్టీ జెండాలతో వైసీపీ అల్లరి మూకలు గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయనీ. దీంతో మరింత మంది జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారన్నారు. గతంలో అమలాపురం ఘటనలో కులాల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టారనీ.. ఇటీవల వైజాగ్‌లో వైసీపీ వాళ్లే కొట్టుకొని, జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు.

- Advertisement -

జనసేన (Janasena)పార్టీని టార్గెట్‌ చేసి, విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ప్రజల డబ్బుతో ప్రభుత్వం కోసం పనిచేస్తుందనీ.. వైసీపీ పాలనలో తాడేపల్లి డైరెక్షన్‌లో పని చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తమ అధినేత పవన్‌ గమనిస్తున్నారనీ.. వైసీపీ కవ్వింపులను ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకు వస్తామని పోతిన మహేష్‌ (Pothina Mahesh) అన్నారు. కాగా.. రాష్ట్రంలో మెుత్తం 13 మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌ విభాగం హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...