Attack: ఏపీ టోల్‌ ప్లాజా సిబ్బందిపై.. తమిళనాడు విద్యార్థులు దాడి

-

Attack: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్వీపురం టోల్‌ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఓ ప్రైవేటు లా కాలేజికి చెందిన తమిళనాడు విద్యార్థులు కారులో తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురం టోల్‌ ప్లాజా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును సిబ్బంది ఆపారు. ఫాస్టాగ్‌ చెల్లింపు పనిచేయకపోవటంతో, టోల్‌ చెల్లించాలని సిబ్బంది కోరారు. వెనుక ఉన్న వాహనాలకు సైతం దారి ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. కానీ విద్యార్థులు టోల్‌ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహంతో దాడి (Attack)కి దిగారు. అక్కడే ఉన్నవారు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నింగా.. వారిపై సైతం దాడి చేశారు. అక్కడితో ఆగక, దెబ్బలకు తాళలేక పరిగెడుతున్న వారిని వెంటాడి మరీ.. విద్యార్థులు దాడికి తెగబడ్డారు.

- Advertisement -

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడి.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఘటనపై పూర్తి విచారణ చేసి.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, విద్యార్థులు మెుండిగా వ్యవహరించి.. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలకు దారి ఇచ్చి.. ఏపీ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలను అడ్డుకున్నారని టోల్‌ ప్లాజా సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read also: పాల్వాయి స్రవంతి కాన్వాయిపై దాడి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...