Puri Jagannadh: పూరి జగన్నాథ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. రౌడి హీరో విజయ్ దేవరకొండతో చేసిన మూవీ ప్రస్తుతం ఆయనను చిక్కుల్లో పడేసింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన లైగర్ బోల్తా పడిన విషయం తెలిసిందే.. దీని కారణంగా బయ్యర్స్ పూరీని డబ్బులకోసం నిలదీయడానికి రెడీ అయ్యారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పూరి బయ్యర్స్‌ని ఉద్దేశించి మాట్లాడిన ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆడియోలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయ్యర్స్‌తో మాట్లాడటం జరిగింది. ఒక నెలలో అగ్రీ అయిన అమౌంట్ ఇస్తాను అని చెప్పాను. ఇస్తాను అని చెప్పాకా.. కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను…. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వాసులు చేసి పెడతారా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి ధర్నా చేసిన వాళ్ల లిస్ట్ తీసుకోని, వాళ్లకు తప్ప మిగతావాళ్లకి ఇస్తా.’’అని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఆడియోలో హాట్ కామెంట్స్ చేశారు.
ఈ వీడియోపై, బయ్యర్స్ గ్రూప్స్‌నుంచి లీక్ అయిన మెసెజ్‌ల పై పూరీ ప్రియ గురువు అయిన రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తనదైన శైలిలో ట్విట్టర్‌లో లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ల మధ్య థ్రెటింగ్ మెసేజ్ సర్క్యూలేట్ అవుతుందని వర్మ పోస్టు చేశారు. అనంతరం పూరీ మాట్లాడిన ఆడియోకి సంబందించిన పోస్ట్ చేస్తూ.. క్యప్సన్‌గా వారు చెస్తున్న పూరి వారి బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గకపోవడమే వారు చేస్తున్న బెదిరింపులకు తగిన ప్రతిఫలం అని క్యాప్సన్ పెట్టారు. వర్మ చేసిన ట్వీట్స్ , పూరి ఆడియో ఇండస్ట్రీలో చర్చంశానియంగా మారాయి. అయితే ఇప్పుడు బయ్యర్స్ ధర్నా చేస్తారో లేదంటే వెనకడుగు వేస్తారో వెచి చూడాలి మరి..!
Threatening Msg circulating in Distribution groups about LIGER pic.twitter.com/RkYRYkNrwz
— Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022
Not bowing down to blackmail here is Puris befitting counter to their criminal intimidation https://t.co/Q2wHsYY6xc pic.twitter.com/egVmtmu0CS
— Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022