Cartoon :పండగైనా.. ఇంట్లో పెళ్లి ఉన్నా రాజకీయాలకు సంబంధం లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి.. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలుకూడా ఎన్నికల ప్రచారలు జోరుగా చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం చెయ్యడంతో పాటు డిజిటల్ మీడియాను కూడా రాజకీయ నాయకులు వారి ప్రచారాలకు అయుధాలుగా వాడుకుంటున్నారు.
తాజాగా.. దీపావళిని పురస్కరించుకొని జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి జనసేన పార్టీ వైసీపీపై వ్యగ్యంగా ఓ కార్టున్ (Cartoon)ని పోస్ట్ చేసింది. ఈ కార్టూన్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ప్రాజెక్టులును ఉద్దేశించి వ్యంగ్యంగా రాసుకొచ్చింది… వైసీపీ వారు టపాసులు వేస్తుంటారు.. అయితే అక్కడకు వచ్చిన పార్టీ అధినేతతో ఓ వ్యక్తి వచ్చి మన టపాసులు ఏవీ పేలట్లేవు సార్ జనసేన టపాసులు మాత్రం దద్దరిల్లి పోతున్నాయి..! అని ఓ కర్టూన్‌ని ట్వట్టర్‌లో జనసేన పార్టీ పోస్ట్ చేసింది. దీనిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి
— JanaSena Party (@JanaSenaParty) October 24, 2022
Read also: లైగర్ సినిమా బయ్యర్స్‌కి పూరి వార్నింగ్