Janvi kapoor :నాన్న కోసం అమ్మ అలా చేసింది

-

Janvi kapoor :నాన్న కోసం అమ్మ చాలా రిస్క్‌ చేసిందంటూ.. దివంగత నటి శ్రీదేవి కుమార్తె నటి జాన్వీకపూర్‌ తన కుటుంబ విశేషాలు పంచుకున్నారు. తన తండ్రి బోనీకపూర్‌కు సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేదని జాన్వీ చెప్పుకొచ్చారు. “ఈ విషయం ‘వాంటెడ్‌’, ‘నో ఎంట్రీ’ సమయంలో జరిగింది. నాన్న సిగరెట్లకు దూరంగా ఉంచేందుకు, నేను, ఖుషి ఎంతో ప్రయత్నించేవాళ్లం. ప్రతిరోజు నాన్నకు తెలియకుండా నాన్న దగ్గర ఉండే సిగరెట్లను ముక్కలు చేసేవాళ్లం. సిగరెట్ల ప్యాకెట్స్‌లో టూత్‌ పేస్టులు పెట్టడం వంటి పనులు చేసినా.. నాన్న అలవాటు మార్చుకోలేదు. దీంతో అమ్మ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. నాన్న సిగరెట్లు మానేవరకు, తాను మాంసాహారం తినని తేల్చిచెప్పారు. అమ్మ వీక్‌గా ఉన్నారనీ.. మాంసాహారం తినాలని డాక్టర్లు చెప్పినప్పటికీ అమ్మ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. నాన్న సైతం అమ్మను ఎంతో బతిమాలాడు, కానీ అమ్మ ఒప్పుకోలేదు. అలా కొంతకాలానికి సిగరెట్లను మానేశారు” అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ నటించిన “మిలీ” త్వరలో విడుదలకానున్న నేపథ్యంలో, ఈ నటి ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడపుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ధూమపానం మానిపించటానికి, వాళ్ల అమ్మ చేసిన పనిని Janvi kapoor గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కరివేపాకుతో కమ్మని ఆరోగ్యం మీ సొంతం..

కరివేపాకుతో(Curry Leaves) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులు ఎలా తీసుకున్నా...

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...