Martial Affair: వివాహేతర సంబంధం, ప్రియుల మోజలో పడి భర్తను చంపటానికి సహకరించిందో భార్య. ఈ నెల 22న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని యెళహంకలో ఓ లేఅవుట్ లోని భవనంపై వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడు చంద్రశేఖర్ (35) స్థానికంగా కార్మికుడిగా పనిచేసేవాడిగా పోలీసులు గుర్తించారు. అతడిని అత్యంత దారుణంగా తలపై కొట్టి, మర్మాంగాలను కత్తిరించి హత్య చేయటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. భార్య శ్వేత తీరు అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టేసరకి.. విస్తుగొలిపే వివరాలు బయటకు వచ్చాయి.
బెంగళూరులో ఎమ్మెస్సీ చదవిన శ్వేత కాలేజీలో పలువురితో డేటింగ్ చేసిట్లు విచారణలో తెలిసింది. సినిమాలు, షికార్లకు బాగా అలవాటు పడటం, ఎక్కువ బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం గొప్పగా భావించేది. దాదాపు 15 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవారనీ.. వారందరితో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి.. అనంతరం వారి నెంబర్లను బ్లాక్‌లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమానితో సైతం సన్నిహితంగా ఉండేది. అతడితో కలిసి కాలేజీకి సైతం వెళ్లేది. అంతేగాకుండా హిందూపురానికి చెందిన ప్రియుడు సురేష్‌తో వివాహేతర సంబంధం (Martial Affair)కొనసాగించేది. ఈ విషయాలన్నీ భర్త చంద్రశేఖర్‌కు తెలిసింది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే భర్తను అడ్డుతొలగించేందుకు భార్య శ్వేత పన్నాగం పన్నింది. కొత్త సిమ్ కార్డు తీసుకొని ప్లాన్ అమలు చేసింది.
ఈ నెల 22న సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలుపించింది శ్వేత. పని కోసం బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చిన భర్తను నీరు రావటం లేదనీ.. ట్యాంకు చూడాలని పంపించింది. ట్యాంక్ వద్ద మాటు వేసి ఉన్న సురేష్.. చంద్రశేఖర్‌పై రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగాలను కత్తిరించి హత్య చేశాడు. హత్య అనంతరం అతడు పరారయ్యాడు. తన భర్తను ఎవరు హత్య చేశారో తెలియదనీ.. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారనీ పొంతలేని సమాధానాలు పోలీసులకు చెప్పటంతో, శ్వేతపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు శ్వేతను విచారించగా, అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు.
Read also: ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్