Nagoba festival: దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా జరుపుకునే నాగోబా జాతరకు తప్పకుండా హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎంపీ సోయం బాపురావు ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్మును కలిసిన తెలంగాణ ఎంపీ సోయం గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నిండటంతో ఓ పక్క ఉత్సవాలు జరుగుతుంటే.. ఇప్పటికీ ఆదివాసీల పరిస్థితులు మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కులు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. వచ్చే నూతన సంవత్సరంలోని జనవరిలో ఉత్సవంగా కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba festival)ప్రారంభం కానుందనీ.. దీనికి ఆదివాసీ ఆడపడుచుగా రావాలని రాష్ట్రపతిని ఆహ్వానించారు.
Read also: రాజధానికి భూములిచ్చి మోసపోయారు