Jagadish Reddy: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై 48 గంటలు ఈసీ నిషేధం విధించింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా, మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ప్రసంగాలు ఓటర్లను బెదిరించే విధంగా ఉన్నాయని ఈసీ వెల్లడించింది. అందువల్ల ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోతే, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఆపేస్తామని మంత్రి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈసీకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా అధికారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మంత్రి (Jagadish Reddy)కి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటలు మంత్రి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తూ, ఈసీ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈసీ తీసుకున్న చర్యలపై టీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ ప్రవర్తిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Read also: యశోద సినిమా స్టోరీనే హీరో