Baby Delivery: కదిలే రైలులో గర్భిణీకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపివేశారు అధికారులు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా.. సదరు గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మిచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యశ్వంతపూర్ ధనపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలులో అనితా దేవి, అతడి సోదరు వినయ్ కుమార్, పిల్లలతో కలిసి బెంగళూరు నుంచి బెనారస్‌కు రైలులో ప్రయాణిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. రైలులో ఉన్న అధికారులకు కుటుంబ సభ్యులు సమాచారం అందజేయటంతో.. పెద్దపల్లిలో ట్రైన్‌ను నిలిపివేసి.. స్టేషన్‌లో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బందే ప్రసవం (Baby Delivery) చేశారు. అనితాదేవి మగబిడ్డకు జన్మనిచ్చిందనీ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రికి తరలించారు.
Read also: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు