YS Sharmila: నిజాయతీ పరులైతే సీబీఐ అంటే భయమెందుకు?

-

YS Sharmila: రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదంటూ కేసీఆర్‌ రహస్య జీవోను ఎందుకు విడుదల చేశారని వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల ప్రశ్నలు సంధించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వైయస్‌ షర్మిల (YS Sharmila) ప్రజా ప్రస్థానం పాదయాత్రను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ తన ఎమ్మెల్యేలతో ఫామ్‌ హౌస్‌ స్టోరీ సృష్టించి.. మునుగోడులో గెలవాలని అనుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. సింపతీ ఓట్ల కోసం కేసీఆర్‌ కొత్త సినిమాను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. మునుగోడులో గెలిచేందుకు ఊరికో ఎమ్మెల్యేను.. రాష్ట్రంలోని అందరి మంత్రులను రంగంలోకి దించారన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ సీబీఐ విచారణ కోరితే.. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టేందుకు వీలు లేదని సీఎం కేసీఆర్‌ రహస్య జీవోను జారీ చేశారని దుయ్యబట్టారు. ఆధారాలుంటే బయటపెట్టడానికి ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులైతే సీబీఐకు ఎందుకు భయపడుతున్నారని షర్మిల నిలదీశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...