Minister Dharmana :ఒక్కచోట అభివృద్ధి వద్దని శ్రీబాగ్ ఒడంబడిక నాడు అభిప్రాయాలు వెల్లడించిందని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సిల్వర్ జుబ్లీ హాల్ ఆర్ట్స్ కాలేజీలో సిక్కోలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో మన రాజధాని-మన విశాఖ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన, మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో పదేళ్లు రాజధానిగా హైదరాబాద్ ఉంది.. కానీ మూడు నెలల్లోనే దాన్ని వదిలేసి చంద్రబాబు వచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇస్తే.. చంద్రబాబు తాబేదారులు చెప్పే విజయవాడ-గుంటూరులో రాజధానే వద్దన్నారని ఎద్దేవా చేశారు.
తనకు మంత్రి పదవి కంటే.. తనను ఈ స్థితికి తీసుకు వచ్చిన ప్రజలే ముఖ్యమని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. చంద్రబాబుకి రియల్ ఎస్టేట్ తప్ప.. ఏం పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పట్టణం విశాఖ మాత్రమేనని.. రాజధానికి అవకాశం ఉన్న ఒకే పట్టణం వైజాగ్ అని అన్నారు. చంద్రబాబు హైదారాబాద్ వదిలిరారు.. కానీ ఇక్కడ ఉన్న నేతలకు ఏం అయ్యిందని మంత్రి ధర్మాన (Minister Dharmana) దుయ్యబట్టారు.
Read also: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోంది