High Court: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్‌ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 10 గంటల తరువాత పబ్‌లలో డీజే, మ్యూజిక్ నిలివేయాలని స్పష్టం చేసింది. కాగా, రాత్రి పది గంటల తరువాత పబ్‌లలో డీజే, మ్యూజిక్‌ను నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలకు సమీపంలో పబ్‌లకు అనుమతి ఇవ్వటంపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు ప్రకారం జూబ్లీహిల్స్‌లోని ఉన్న ట్రాట్, జూబ్లీ 800, ఫర్టీ కేఫ్, అమ్నిషియా, హైలైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్లతోపాటు రో పవ్ లోనూ రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే సౌండ్స్, మ్యూజిక్‌ను ప్లే చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది.
Read also: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్..?