Amaravathi: అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు విచారణను నేడు చేపట్టింది. అయితే విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు లలిత్ విముఖత చూపారు. తాను లేని ధర్మాసనానికి విచారణను బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో కేసు వేరే బెంచ్‌కు బదిలీ అయింది. అయితే.. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వనికి లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టు తీర్పు పై స్టే విధించాలని ఎపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు అమరావతి(Amaravathi) రాజధాని అంశంపై రైతులు కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -