Mekathoti sucharitha: వైసీపీకి షాక్‌ ఇచ్చిన మాజీ హోంమంత్రి

-

Mekathoti sucharitha resigns for Guntur district YCP president: తాజా పరిణామాలు చూస్తుంటే.. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత క్రమంగా వైసీపీకి దూరం అవుతన్నట్లు కనిపిస్తోంది. సుచరిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాననీ.. పార్టీకు కాదని సుచరిత స్పష్టం చేశారు. తన నియోజకవర్గమైన ప్రతిపాడుకు మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించారు. కాగా మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించకపోవటంపై సుచరిత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

- Advertisement -

రెండవ సారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి పార్టీతో ఆమె సఖ్యత మెలగటం లేదు. ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల ఆందోళన కారణంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వైసీపీకు బలం తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుచరిత(Mekathoti sucharitha)జిల్లా అధ్యక్ష పదవి నుంచి వైదలగొటం వైసీపీకు షాక్‌ అని చెప్పుకోవచ్చు. పార్టీ అధిష్టానం ఆమెను బుజ్జగిస్తుందా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...