AFRC Warning to colleges: కాలేజీల్లో నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (AFRC) కాలేజీలకు హెచ్చరించింది. నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయరాదంటూ ఆదేశించింది. ఫీజులను అదనంగా వసూలు చేస్తే 2లక్షల ఫైన్ తప్పదని ఫీజు రెగ్యులేటరీ కమిటీ పేర్కొంది. ఈ ఫైన్ అనేది ఎంతమంది దగ్గర ఎక్కువ వసూలు చేస్తారో.. అన్ని రూ. 2 లక్షలు ఫైన్ వేస్తామని తెలిపింది. కాలేజీలు అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి ఇవ్వాల్సిందేనని.. ఏఎఫ్ఆర్‌సీ ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్ చేయబడిన విద్యార్థుల మెరిట్ కంటే.. తక్కువ మెరిట్ ఉన్న వారికి సీటు ఇచ్చినట్లయితే.. రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
- Advertisement -