Bnadi sanjay fires on CEO in munugode Bypoll conuting:మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ.. ఫలితాలను వెల్లడించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ లీడ్ వస్తే తప్ప.. సీఈవో రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్ చేయటం లేదని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో గతంలో ఎన్నడూ జరగని విధంగా.. ఇప్పుడే ఎందుకు ఆలస్యం అవుతోందని నిలదీశారు. మీడియా నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తరువాతే.. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తున్నారని.. లేకపోతే ఎందుకు ఫలితాలను ప్రకటించటం లేదని ప్రశ్నించారు. మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్ చేసేందుకు ఎందుకు లేట్ అయ్యిందో సీఈవో చెప్పాలని బండి సంజయ్ (Bandi sanjay) డిమాండ్ చేశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. కాగా, మంత్రి జగదీష్ సైతం ఇదే విధంగా సీఈవోను హెచ్చరించిన విషయం తెలిసిందే.