Gudivada Amarnath fires on tdp leader yanamala: పన్ను నొప్పి వస్తే సింగపూర్ వైద్యం కోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన యనమల రామకృష్ణుడుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యనమల రామకృష్ణుడు మాట్లాడినవన్నీ అబద్ధాలేనని విమర్శలు గుప్పించారు. యనమల తనను తాను మేధావిగా భావిస్తాడని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ పేరు ఉందనే కారణంతోనే.. ఎన్టీఆర్ యనమలను ఎంకరేజ్ చేశారన్నారు. కానీ ఎన్టీఆర్‌ను దించేయటానికి చేసిన కుట్రలో యనమల కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అప్పట్లో స్పీకర్ స్థానంలో కూర్చొని కనీసం.. ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో తెచ్చిన లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పుకు యనమల లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వచ్చిన ప్రత్యేక పరిస్థితుల్లో తెచ్చిన అప్పుల్లో ప్రతి రూపాయి ప్రజలకు చేరిందని మంత్రి అమర్‌నాథ్ వివరించారు.
Gudivada Amarnath : యనమల ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
-