Suicide: వీడియో కాల్‌లో ప్రియురాలుని చూస్తూ…ఆత్మహత్య

-

lover Live Suicide at old city in Hyderabad: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు సైతం పెళ్లికి అంగీకరించారు. ఇంతలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు చెలరేగాయి. దీంతో.. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమవుతుందోనన్న బెంగ.. పెళ్లి కాదనే ఆందోళనతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదికూడా ప్రియురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే లైవ్‌లో ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘట హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగింది.

- Advertisement -

ఓల్డ్‌ సిటీలోని కలాపట్టర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహ్మద్‌ తబ్రేజ్‌ అలీ, స్థానికంగా ఉండే ఓ యువతి ప్రేమించుకున్నారు. వీర ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలియగా, వివాహం చేసేందుకు పెద్దలు అంగీకరించారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య విభేధాలు రావటంతో పెళ్లి.. వాయిదా పడింది. గొడవలు ఇప్పడుప్పుడే సద్దుమణేగేలా లేవని అలీ మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకుంటుండగానే.. అలీ అకస్మాత్తుగా లైవ్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ హఠాత్‌పరిణామంతో ప్రియురాలు భయపడింది. వెంటనే ప్రియుడి బంధువులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన యువకుడి బంధువులు గదిలో వెళ్లి చూడగా, అతడు అప్పటికే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...