7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న శాలరీ

-

7th pay commission updates central government employees will get another DA hike from January 2023: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం (central government) నుండి శుభవార్త వెలువడనుంది. జీతాల్లో భారీ పెరుగుదల కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కరువు భత్యం (DA) పెరిగి, జీతభత్యాలు పెరగనున్నాయి. కొద్దిరోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల డీఏ 4 శాతం పెంచిన విషయం అందరికీ తెలిసిందే. పెరిగిన 4 శాతం డీఏ తో ప్రస్తుతం ఉద్యోగులకు 38 శాతం డీఏ వస్తోంది. కాగా వచ్చే ఏడాది 2023, జనవరిలో మరోసారి ఉద్యోగులకు డీఏ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

ఈసారి కూడా 4 శాతం డీఏ పెరగవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు నాలుగు శాతం డీఏ పెరిగితే మొత్తం 42 శాతానికి చేరుకోనుంది. దీంతో వారి జీతాల్లో భారీ వ్యత్యాసం కనిపించనుంది. కరువు భత్యం రూల్స్ ప్రకారం డీఏ 50 శాతానికి చేరితే దానిని జీరో చేసి, 50 శాతానికి వచ్చే డీఏ అమౌంట్ ని వారి కనీస వేతనంలో చేరుస్తారు. కాగా 2016లో 7th పే కమిషన్ (7th pay commission) అమలు చేసినప్పుడు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ను జీరో చేసారు. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.20 వేలు ఉంటే, 50 శాతం డీఏ అనగా రూ.10 వేలు ఉంటుంది. ఈ రూ. 10 వేలు డీఏ అతని బేసిక్ శాలరీ (Basic salary) లో కలిపి రూ.30 వేలు అవుతుంది. అప్పుడు డీఏ జీరో చేయగా మళ్ళీ మొదటి నుండి డీఏ కౌంట్ అవుతుంది.

ఇదిలా ఉండగా దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, డీజిల్, కూరగాయలు, ఇలా ఒకటేమిటి… అన్నిటిపైనా ధరల మోత మోగుతోంది. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. సామాన్యులకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...