Education commissione warning to Nizam College students: నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం రోజురోజుకి ముదురుతోంది. గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో స్టూడెంట్లతో నవీన్ మిట్టల్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్ భీమానాయక్ ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో హాస్టల్‌ని పీజీ విద్యార్థులకే కేటాయిస్తామని, కుదిరితే సగం యూజీకి, సగం పీజీ విద్యార్థులకు ఇస్తామని నవీన్ మిట్టల్ సమావేశంలో 10మంది విద్యార్థినులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే.. దీనికి విద్యార్థినులు తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.కాగా.. ఆందోళన చేసిన స్టూడెంట్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పామని కూడా హెచ్చరించారని… ఒక ఐఏఎస్ ఆఫీసర్ తమతో ఇలా దురుసుగా మాట్లాడటం ఊహించలేదన్నారు. తమకు వంద శాతం హాస్టల్‌ని కేటాయించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్టూడెంట్స్ కాలేజీ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన ప్రయోజనం లేదని విద్యార్థులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.
Students are disappointed with the IAS officer’s response. “We will continue the protest until we get hostel accommodation. We have not done anything wrong,” student said.
Around 600 UG students are paying rent and staying outside, due lack of hostel facilities. @nimishaspradeep pic.twitter.com/L9vrOLYlkK
— @Coreena Enet Suares (@CoreenaSuares2) November 10, 2022