PM Modi: ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు మోదీ శంకుస్థాపన

-

PM Modi laid foundation stone for five development programs today: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం విశాఖకు చేరుకున్న విషయం తెలిసిందే.. కాగా.. మోదీ నేడు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ఈ సభలో 40 నిమిషాలు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ సభావేదికపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మాత్రమే ఉంటారు.మోదీ రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 106 కోట్లు కేటాయించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. విశాఖలో ప్రస్తుత డీఆర్ఎమ్ ఆఫీసుకు సమీపంలోనే రైల్వేజోన్ భవనాలు నిర్మించనుంది.

- Advertisement -

కాగా..3,778 కోట్లతో రాయూర్-విశాఖ ఎకనమిక్ కారిడార్ రోడ్డు, 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ రోడ్డు, 152 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, 2,658 కోట్లతో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులకు PM శంకుస్థాపన చేస్తారు. 211 కోట్లతో పూర్తిచేసిన నరసన్నపేట-పాతపట్నం రోడ్డు, 2,911కోట్లతో నిర్మించిన ONGC డీప్ వాటర్ ప్రాజెక్టులులను.. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని (PM Modi) నేడు జాతికి అంకితం చేస్తారు.

.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...